💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔* ✍️ *ప్రశ్న:* కుంకుమ తయారీ ఎలా? *జవాబు:* కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ (Kumkum) హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఆ కుంకుమ తయారి గురించి . కావలిసిన సామానులు : 10 కిలోలు , పసుపుకొమ్ములు , 1 కిలో పటిక , 1 కిలో ఎలిగారం , 400 నిమ్మకాయలు , 1/2 కిలో నువ్వుల నూనె . ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన...