Skip to main content

కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది?

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔*

✍️ *ప్రశ్న:* కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది?
*జవాబు:* పాడైన గుడ్లు మాత్రమే కాదు , ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటి్లో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకి , కుళ్ళిపోయిన గుడ్డుకి సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణము . సాధారణముగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా వుంటుంది . ఈ కారణముగా అది నీటిలో మునుగుతుంది . కుళ్ళిపోయిన గుడ్డుకూడా అదే పరిమాణములో ఉన్నప్పటికీ దానిలో నుండి కొన్ని బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్ళిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది. 

ఎదైనా ఒక వస్తువు యొక్క ఘన పరిమాణము తగ్గకుండా , దాని ద్రవ్యరాశి మాత్రం తగ్గిందీ అంటే దానర్ధము ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే . ఉదాహరణము .. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బందించామనుకుందాం . అప్పుడు ఆ పాత్ర సాంద్రత కేవలము 5-6 కోట్ల గాలి కణాలను మాత్రమే బందించామనుకుందాం . పాత్ర అలాగే ఉన్నప్పటికీ , లోపలి గాలి తీసేస్తే .. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్ళిన గుడ్డు విషయములోనూ ఇలాగే జరుగుతుంది . కుళ్ళిన గుడ్డుసాంద్రత నీటి సాంద్రత కన్న తక్కువగా వుండటం వల్ల అది నీటిలోతేలుగుంది. . ఈ సందర్భముగా మనము మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి .ఒకవేళ కోడిగుడ్డుని చిక్కని ఉప్పునీటిలో వేసినట్లైతే గుడ్డు కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా వుండె కారణముగా మనము నీటిలో వేసిన గుడ్డు మంచిదైనా , పాడైనదైనా అది ఉప్పునీటిలో తేలుగుంది. 
         💦🐬🐥🐋💦

Comments

Popular posts from this blog

Some trees are cool but not all .why?

* Why? What? How? 🤔  Question:                          It is much colder under some trees. To make   that difference in the shade of the trees?  Answer:                   If there is shade under almost all the trees we get cold feeling in summer. Depending on the size of the leaves on the tree and the thickness of the branches, dense or thin shadows may form. Achieving different levels of cooling under different trees is affected not only by the intensity of the shade but also by how high the leaves of those trees are on our heads and the amount of water received by those trees. If the alleys between the leaves and between the branches are good, the shade intensity will be less and the coolness will be less. If the leaves of the trees are too high on the head, the feeling of coolness will be less due to the hot air around us repeatedly touc...

What is light year

* Why? What? How? 🤔  * ప్రశ్న * Question: * What is a light year?  * Answer: * Light years "is not a measure of time. It measures distance. The distance that light travels in a year in a vacuum is called a" light year. "The distance between stars and planets in space is such that it takes years for light from one sphere to reach another sphere. It is then used to measure the distance between them. Is it any wonder that a ray of light travels three million kilometers in a second? How far does such a ray of light travel in a year? It is 9.3 × 10¹⁵ meters. This distance is called a light year. This is 9 lakh 50 thousand crore km (9.3 × 10× meters.) 💦🐋🐥🐬💦 In telugu 💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔 ✍️ *ప్రశ్న:* కాంతి సంవత్సరం అంటే ఏమిటి? *జవాబు:* కాంతి సంవత్సరాలు" కాలాన్ని కొలిచే పరిమాణం కాదు. అది దూరాన్ని కొలుస్తుంది. కాంతి, శూన్యంలో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని "కాంతి సంవత్సరం" అంటారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల మధ్య ఎంత దూరం no, ఒక గ...

ఎందుకు, ఏమిటి,ఎలా ? 2

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔* ✍️ *ప్రశ్న:* కెలోరీలు అంటే ఏమిటి? *జవాబు:* కెలోరీ అనేది శక్తిని కొలిచేందుకు వాడే ఒక ప్రమాణం. సాధారణంగా ఉష్ణశక్తిని కొలవడానికి వాడతారు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బతికి ఉండాలన్నా, ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. అది మనకు ఆహారం ద్వారా లభిస్తుంది. ఒక మనిషికి ఎంత ఆహారం కావాలి,. తద్వారా ఎన్ని కెలోరీల శక్తి అవసరం అనే విషయాలు ఆ మనిషి వయసు, వృత్తి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా 30 సంవత్సరాల వయసుగల వ్యక్తికి సుమారు 3500 కెలోరీల శక్తి అవసరం. యవ్వనంలో ఉన్నవారికి అదనంగా శక్తి అవసరం.  చలి ప్రాంతాల్లో ఉన్నవారికి, గర్భిణులకు, అధిక శారీరక శ్రమ చేసేవారికి కూడా అదనపు శక్తి అవసరం అవుతుంది. మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లు, మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్‌) ప్రధాన శక్తిదాయకాలు. మనకు సమారు 60 శాతం శక్తి పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్స్‌) నుంచి వస్తుంది. దాదాపు 20 శాతం మాంసకృత్తులు, మరో 20 శాతం కొవ్వు పదార్థాల నుంచి లభిస్తుంది. కెలోరీలు మరీ ఎక్కువయితే ఊబకాయం (ఒబేసిటీ) వస్తుంది. మరీ తక్కువైతే సొమ్మసిల్లి పడిపోతారు. సంతులన ఆహారం తీసుకుంటూ, వ్యాయ...