Skip to main content

Posts

కిరణం చివర కనబడదేం?

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా? ✍️ *ప్రశ్న:* కిరణం చివర కనబడదేం? *జవాబు:* కాంతి కిరణం అంటే కాంతి పయనించే మార్గాన్ని చూపే సరళరేఖ. నిజానికి మనం చూసేది కాంతికిరణం (light ray) కాదు. మనకి కనబడేది కాంతి పుంజం (light beam). ఇది కొన్ని కాంతి కిరణాల సముదాయం. మన కంటివైపు నేరుగా దూసుకు వచ్చే కాంతి పుంజాన్ని మనం చూడగలుగుతున్నామంటే దానర్థం దానిలోని కాంతి శక్తి మన కంటికి చేరిందనే. కాంతి శూన్యంలో కూడా పయనించే విద్యుదయస్కాంత తరంగం. ఈ తరంగాలు సరళమార్గంలో అత్యంత వేగంగా సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో వాటిని ఏదైనా వస్తువు శోషించేవరకు కానీ, వాటి మార్గాన్ని మార్చేవరకూ కానీ పయనిస్తూ ఉంటాయి. రాత్రి వేళల్లో ఒక టార్చిలైటును ఏటవాలుగా ఆకాశంవైపు వేస్తే చీకట్లోకి అతి వేగంగా పయనించే ఆ కాంతిపుంజం ముందు భాగాన్ని మనం చూడలేం. అలాగే టార్చ్‌లైట్‌ను ఆపుచేసినా కాంతి పుంజం చివరనూ మనం చూడలేం. దానికి కారణం కాంతిశక్తి అత్యంత వేగంగా ప్రయాణించడమే.               💦🐋🐥🐬💦

కుంకుమ తయారీ ఎలా?

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔* ✍️ *ప్రశ్న:* కుంకుమ తయారీ ఎలా? *జవాబు:* కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ (Kumkum) హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.  ఆ కుంకుమ తయారి గురించి .  కావలిసిన సామానులు : 10 కిలోలు , పసుపుకొమ్ములు , 1 కిలో పటిక , 1 కిలో ఎలిగారం , 400 నిమ్మకాయలు , 1/2 కిలో నువ్వుల నూనె .  ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన...

కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది?

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔* ✍️ *ప్రశ్న:* కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది? *జవాబు:* పాడైన గుడ్లు మాత్రమే కాదు , ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటి్లో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకి , కుళ్ళిపోయిన గుడ్డుకి సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణము . సాధారణముగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా వుంటుంది . ఈ కారణముగా అది నీటిలో మునుగుతుంది . కుళ్ళిపోయిన గుడ్డుకూడా అదే పరిమాణములో ఉన్నప్పటికీ దానిలో నుండి కొన్ని బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్ళిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది.  ఎదైనా ఒక వస్తువు యొక్క ఘన పరిమాణము తగ్గకుండా , దాని ద్రవ్యరాశి మాత్రం తగ్గిందీ అంటే దానర్ధము ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే . ఉదాహరణము .. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బందించామనుకుందాం . అప్పుడు ఆ పాత్ర సాంద్రత కేవలము 5-6 కోట్ల గాలి కణాలను మాత్రమే బందించామనుకుందాం . పాత్ర అలాగే ఉన్నప్పటికీ , లోపలి గాలి తీసేస్తే .. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్ళిన గుడ్డు విషయములోనూ ఇలాగే జరుగు...

ఎందుకు, ఏమిటి,ఎలా ? 2

💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?🤔* ✍️ *ప్రశ్న:* కెలోరీలు అంటే ఏమిటి? *జవాబు:* కెలోరీ అనేది శక్తిని కొలిచేందుకు వాడే ఒక ప్రమాణం. సాధారణంగా ఉష్ణశక్తిని కొలవడానికి వాడతారు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బతికి ఉండాలన్నా, ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. అది మనకు ఆహారం ద్వారా లభిస్తుంది. ఒక మనిషికి ఎంత ఆహారం కావాలి,. తద్వారా ఎన్ని కెలోరీల శక్తి అవసరం అనే విషయాలు ఆ మనిషి వయసు, వృత్తి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా 30 సంవత్సరాల వయసుగల వ్యక్తికి సుమారు 3500 కెలోరీల శక్తి అవసరం. యవ్వనంలో ఉన్నవారికి అదనంగా శక్తి అవసరం.  చలి ప్రాంతాల్లో ఉన్నవారికి, గర్భిణులకు, అధిక శారీరక శ్రమ చేసేవారికి కూడా అదనపు శక్తి అవసరం అవుతుంది. మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లు, మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్‌) ప్రధాన శక్తిదాయకాలు. మనకు సమారు 60 శాతం శక్తి పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్స్‌) నుంచి వస్తుంది. దాదాపు 20 శాతం మాంసకృత్తులు, మరో 20 శాతం కొవ్వు పదార్థాల నుంచి లభిస్తుంది. కెలోరీలు మరీ ఎక్కువయితే ఊబకాయం (ఒబేసిటీ) వస్తుంది. మరీ తక్కువైతే సొమ్మసిల్లి పడిపోతారు. సంతులన ఆహారం తీసుకుంటూ, వ్యాయ...

ఎందుకు,ఏమిటి,ఎలా?-1

 ప్రశ్న1: కెమేరాపై ఆ సంఖ్యలేల? *జవాబు:                     మొబైల్‌, డిజిటల్‌ కెమేరా ఎంత విశదంగా ఫొటోలు తీయగలదో సూచించే సంఖ్యలే ఇవి. వీటిలో Pxఅనేది పిక్చర్‌ ఎలిమెంట్‌(picture element)కి సంక్షిప్త రూపం. దీన్నే పిక్సెల్‌ అని కూడా అంటారు. డిజిటల్‌ కెమేరాలకు, పూర్వపు ఫిల్మ్‌ కెమేరాలకు తేడా ఉంది. ఫిల్మ్‌ కెమేరాలలో రసాయనిక రేణువుల సాంద్రత బొమ్మ స్పష్టతకు కొలమానంగా ఉండేది. డిజిటల్‌ కెమేరాల్లో ఫిల్మ్‌లు ఉండవు. కటకం (లెన్స్‌) వెనుక ఓ ఫలకం (plate)ఉంటుంది. దీనిపై సూక్ష్మమైన కాంతివిద్యుత్‌ గ్రాహకాలు(Photo electric receptors) ఉంటాయి. ఇవి ఆ ఫలకంపై అడ్డం, నిలువు వరసల్లో అనేకం ఉంటాయి. ఒక చదరపు సెంటీమీటర్‌ ప్రాంతంలో 13 లక్షల గ్రాహకాలు ఉంటే ఆ కెమేరా సామర్థ్యాన్ని 1.3 Mpxఅని సూచిస్తారు. అంటే మెగా పిక్సల్స్‌ అని అర్థం. అలాగే 32 లక్షల గ్రాహకాలు ఉంటే 3.2 మెగా పిక్సల్స్‌గా పేర్కొంటారు. వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ కెమేరాతో తీసే ఫొటోలు అంత స్పష్టంగా ఉంటాయి.          💦🐋🐥🐬💦